కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీల అమలుపై ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాల సమర్పణ 

ప్రజాలహరి మిర్యాలగూడ;కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజావాణి కేంద్రాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నాయకులు విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, పెన్షనర్లు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు ఇన్‌చార్జీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed