రేషన్ బియ్యం లో కల్తీ ని అరికట్టాలి; సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు

ప్రజాలహరి మిర్యాలగూడ;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి మెమోరండం ఇవ్వనైనది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పంతో ప్రజలు మొత్తం అందరూ వండుకొని తినాలని ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రేషన్ సన్న బియ్యం దళారీల ద్వారా కల్తీ జరుగుతుందని వారన్నారు బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు బియ్యాన్ని రైస్ మిల్లుల ద్వారా ఎఫ్సిఐ గోదాములకు లేదా సివిల్ సప్లై గోడౌన్లకు మిల్లుల ద్వారా వస్తుంటాయి ఈ బియ్యాన్ని క్వాలిటీ ఇన్స్పెక్టర్లు సెలెక్ట్ చేసి బియ్యాని పాస్ చేసి తర్వాతనే గోడౌన్లోకి దిగుమతి చేస్తారు మరి ఈ బియ్యం అధికారులు వారి స్వార్థాలకు మరిగి నాసిరకం బియ్యాన్ని పాస్ చేసి గోడౌన్లో దిగుమతి చేస్తున్నారు ఆ బియ్యం రేషన్ షాపులకు డివిజన్ పరిధిలో ఉన్న రేషన్ బియ్యం కాంట్రాక్ట్ లారీల ద్వారా అన్ని రేషన్ షాపులకు తరలిస్తారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరి పల్లి గ్రామంలో ఒక డీలర్ షాప్ ని పరిశీలించగా 20 బస్తాల వరకు పూరి కోసతో కుట్టిన బస్తాలు దిగుమతి అయినవి ఆ బస్తాలలో బియ్యం దుమ్ము ధూళి పురుగులు కింద పడిన బియ్యాన్ని ఊడ్చి బస్తాలోకి పోసినట్టుగా సిపిఐ పార్టీ అభిప్రాయపడుతున్నది అని వారన్నారు కాంట్రాక్టర్ వేరే ఏమైనా అక్రమ దందాలు చేసి ఈ బియ్యాన్ని రేషన్ షాపులకు ఏమైనా పంపిస్తున్నారా లేదా అధికారులు పాస్ చేసిన బియ్యాన్ని పంపిస్తున్నారు కాంట్రాక్టర్ అధికారులకే తెలియాలి అని వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ప్రజలందరికీ అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బియ్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కలిసి ప్రజలు తినాలని సామూహిక ఇష్టబంతులు పెట్టి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొని సహబంతి భోజనం చేసినారని వారన్నారు మరి ఇవ్వాలి ఈ రేషన్ షాపుకు వచ్చినటువంటి బియ్యాన్ని తింటే ప్రజలు అనారోగ్యాలు హాస్పటల్ పాలు కావడమే తప్ప ప్రభుత్వం చెప్పింది ఒకటి ప్రభుత్వ అధికారులు చేసేది ఒకటి ఈ బియ్యాన్ని ఏం చేస్తారో వారి ఆలోచించాలని వారు అన్నారు ప్రజలు మాత్రం ఈ బియ్యాన్ని తినే పరిస్థితి ఉండదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు రేషన్ షాపులకు పంపించి బియ్యాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసి పంపియాలని వారన్నారు ఈ మెమోరాణం ఇచ్చిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజన్న పెళ్లి రామలింగం గువ్వల మట్టయ్య ఎస్కే షమీం ఎస్కే రహీం డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

You May Have Missed