నల్లగొండలో గంజాయి విక్రేతల అరెస్ట్

ప్రజాలహరి మిర్యాలగూడ;నల్లగొండ లో గంజాయి విక్రేతలు, బైక్ దొంగల ముఠా అరెస్ట్…ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ 2 టౌన్ పోలీసులు. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేసి విక్రయిస్తున్నట్లు నల్గొండ DSP శివరాం రెడ్డి తెలిపారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తింపు.2.5 కిలోల గంజాయి పట్టుకున్నట్లు దీని విలువ సుమారు 25 వేలు ఉంటుందని అంచన.నిందితుల నుంచి 4 బైక్‌లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనపర్చుకోగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని నల్గొండDSP తెలిపారు.

You May Have Missed