విద్యార్థినులతో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;రాఖీ పౌర్ణమి సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR విద్యార్థినులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురుకుల విద్యార్థినులు ఎమ్మెల్యే BLR కు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఎమ్మెల్యే విద్యార్థినుల చేత రాఖీలు కట్టించుకుని వారిని ఆశీర్వదించారు…విద్యార్థినుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు… అనంతరం రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులకు కానుకగా పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు… కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్ర నాగు నాయక్ , మాజీ సర్పంచ్ బంటు కిరణ్ మరియు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR కలిసి ఈ మొత్తాన్ని పాఠశాలకు అందించారు.. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు గురుకుల పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు… రక్షా బంధన్ స్ఫూర్తి తో ప్రేమ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను పెంచుతూ అందరం కలిసి పనిచేయాలని అన్నారు.. రక్షాబంధన్ పర్వదినాన్ని విద్యార్థినులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



