మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణకు ధ్యానం ఒక వరం

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్‌లో నిర్వహించిన మెడిటేషన్ (ధ్యానం) కార్యక్రమంలో DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ ,
కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణకు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో మెడిటేషన్‌ను ఒక భాగం చేసుకోవడం ద్వారా ఏకాగ్రత, పనిలో ఉత్సాహం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధ్యానంలో పాల్గొన్నారు.

You May Have Missed