ఆంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రభుత్వం: నామిరెడ్డి

వేములపల్లి( ప్రజాలహరి) శ్రీశైలం డ్యాం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తుండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, నోరు మెదపకుండా ఉండటం చాలా సిగ్గుచేటు అని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలంలో సెట్టిపాలెం మేజర్ కాలువ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీశైలం డ్యాం పరిధిలోని పోతిరెడ్డిపాడు కు 30 వేల క్యూసెక్కుల అక్రమంగా తెలుగు గంగ, హంద్రీ ,నీవా ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారు. అంతేకాకుండా నాగార్జునసాగర్ డ్యాం నుండి కుడి కాలువకు ఆంధ్ర నాయకులు అక్రమంగా గేట్లు ఎత్తి మన నీటిని జలదోపిడి చేస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం కనులు నుండి చూడలేని విధంగా, చెవులు ఉండి వినలేని విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నిద్రమత్తు వదిలి తక్షణమే ఎడమ కాలువకు నీరు అందిస్తూ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నింపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ముఖ్యంగా నాగర్జున సాగర్ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

You May Have Missed