జప్తి వీరప్ప గూడెంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ప్రజాలహరి మిర్యాలగూడ;జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్ప గూడెం మండలం మిర్యాలగూడ నందు రక్షాబంధన్ వేడుకలు ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బిక్షపతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క విశిష్టతను ప్రాధాన్యతను తెలిపారు .రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్లకు ,అక్కా తమ్ముళ్లకు సంబంధించిన విషయం కాదని రక్షణ కోసం ఒకరికొకరు కష్టసుఖాల్లో, బాధల్లో, ఆనందం లో సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు రక్షణ గా ఉంటూ ఆ రక్షణ కుటుంబ రక్షణగా, గ్రామ రక్షణగా, దేశ రక్షణగా ఉండాలనే దృఢ సంకల్పమే రక్షాబంధన్ అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య, ఎడవల్లి దామోదర్ రెడ్డి, ఒట్టే మాధవి, తుమ్ములూరి శ్రీనివాస్ రెడ్డి, ధీరావత్ జలరం, నారాయణ చంద్రకళ, రేణుక తదితరులు పాల్గొన్నారు

Previous post

హాలియా మున్సిపాలిటీలోనీ అన్ని వార్డులలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) – మ్యాపింగ్ కాని & అనామిలీస్ (పొరపాట్లు) ఉన్నటువంటి ఓటర్లకు నోటీసులు అందిన వారికి అవగాహన 

Next post

ఆంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రభుత్వం: నామిరెడ్డి

You May Have Missed