హాలియా మున్సిపాలిటీలోనీ అన్ని వార్డులలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) – మ్యాపింగ్ కాని & అనామిలీస్ (పొరపాట్లు) ఉన్నటువంటి ఓటర్లకు నోటీసులు అందిన వారికి అవగాహన 

ప్రజాలహరి హాలియా;తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాలు మరియు హాలియా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు సమావేశాలని వార్డులలో అధికారులు నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాను ప్రజలకు చదివి వినిపించారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు లేదా పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదై, ఏ ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అదేవిధంగా నోటీసులు అందిన ఓటర్లు తేదీ 28.08.2026 నుండి 01.09.2026 వరకు ఎన్నికల అధికారి వద్దకు మీకు సంబంధించిన డాక్యుమెంట్లతో హాజరై మీ యొక్క ఓటులో ఉన్న పొరపాటులను సరిదిద్దుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి పాల్గొని ప్రజలను ఓటరు జాబితాను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు),R .P లు,బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) మరియు వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You May Have Missed