ముస్లిం సోదరులకు మీలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు — ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం 47వ వార్డులో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర మీలాద్-ఉన్-నబీ పర్వదిన కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR ముస్లిం సోదరులకు మీలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు… ప్రవక్త మహమ్మద్ బోధనలు మానవాళికి శాంతి, సోదరభావం, ప్రేమ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను అందించాయని పేర్కొన్నారు…. మిర్యాలగూడ నియోజకవర్గంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో కలిసి మెలిసి జీవించేలా కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే BLR తెలిపారు.. ప్రజలందరి సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.అనంతరం నిర్వహించిన మిఠాయి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed