ఎల్నినో ప్రభావం నుండి రైతులను ఆదుకోవాలి తెలంగాణ రైతు సంఘం దామరచర్ల

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు దామరచర్ల మండలంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంతో రైతులు వేసిన పంటలు అధిక ఉష్ణోగ్రతతో సరైన వర్షపాతం లేక పంటలు ఎండిపోతాయి. ప్రభుత్వం తక్షణమే రైతాంగం అందరిని ఆదుకోవాలని మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు వినోద్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటికే రైతులు అందరు కూడా వరి పత్తి మరియు మిర్చి తోటలను వేసుకోవడం జరిగింది. ఎల్నినో ప్రభావం వలన సరైన వర్షపాతం లేక పంటలన్నీ కూడా ఎండిపోయి రైతులు దీన స్థితిలో ఉన్నారు. రైతులు వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుకు వెళితే బ్యాంకు వారు రుణాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా రైతులు తాము వేసిన పంటలను కాపాడుకోవడం కోసం ప్రైవేట్ వారి నుండి అప్పులు తీసుకొని బోర్లు వేయించుకొని వేసిన బోర్లు నీళ్లు పడక అప్పుల పాలవుతున్నారు వ్యవసాయానికి రావాల్సిన 24 గంటలు కరెంటు కూడా రావడం లేదు. 8 నుంచి 12 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నారు. కనీసం వ్యవసాయానికి 18 గంటల్లో కరెంటు వచ్చే విధంగా విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికే కొన్ని గ్రామాలలో తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగర్ ఎడమ కాలవ ద్వారా నీటిని విడుదల చేసి వేసిన పంటలు పండే విధంగా మరియు తాగునీటి కోసం ఆరుతడి విధానంలో అయినా ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలని వారు అన్నారు. అప్పుడు మాత్రమే రాష్ట్రంలోని రైతులకు కొంచమైనా బాసటగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ చర్యలు తీసుకొని రైతులను ఎల్నినో ప్రభావం నుండి కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎర్రనాయక్,కార్మిక సంఘం నాయకులు దయానంద్, సుభాని తదితరులు పాల్గొన్నారు.

Previous post

ప్రభుత్వ బడులను గాలికి వదిలేసిన సర్కార్ సమస్యల వలయంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసం  పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల తీరు SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ 

Next post

అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి మంత్రి కోమటిరెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలి

You May Have Missed