పల్లె దావాఖాన, మహిళా సంఘం భవనం, అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి వేములపల్లి;వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖాన, మహిళా సంఘం భవనం, అంగన్వాడీ కేంద్రాలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR మరియు RDO రమణా రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడం, చిన్నారులకు మెరుగైన పోషకాహారం మరియు విద్యా వాతావరణం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు…పల్లె దావాఖాన ద్వారా గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని, మహిళా సంఘం భవనం ద్వారా మహిళా సంఘాల కార్యకలాపాలకు, స్వయం ఉపాధి మరియు ఆర్థిక సాధికారత కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య పరిరక్షణ సేవలు మరింత మెరుగ్గా అందుతాయని పేర్కొన్నారు… గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే BLR తెలిపారు.శెట్టిపాలెం గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు…ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



