గుట్టు చప్పుడు కాకుండా సామాజిక తనిఖీఫీల్డ్ అసిస్టెంట్లు ఆడింది ఆట పాడింది పాట

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలో 15వ విడత సామాజిక తనిఖీని జిల్లా అధికారులు గుట్టు సప్పిడి కాకుండా, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆడింది ఆట పాడింది పాటగా నిర్వహించారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలో ఇంచార్జి ఎంపీడీవో జ్యోతి అధ్యక్షతన నిర్వహించినటువంటి సమావేశంలో వివిధ గ్రామాల్లో, పలు అవక తవకలు జరిగినట్టుగా గుర్తించారు. అందులో భాగంగా అన్నపరెడ్డి గూడెం గ్రామంలో 90 నర్సరీ మొక్కలు చనిపోయినట్టుగా తేలింది. ముఖ్యంగా సల్కునూరు గ్రామంలో ఒక నిరుపేద సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ ను నాకు జాబ్ కార్డు ఇప్పించి పని పెట్టమని అడగగా, 500 రూపాయలు ఇస్తేనే పని పెడతాను లేకుంటే లేదని అన్నాడు. దీంతో అతను సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి డి హరీష్ కుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి వేణుగోపాలరావు, ఏపీవో శ్రీనివాసరెడ్డి, సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

You May Have Missed