రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులతో ఘనంగా వేడుకలు

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని శివాని టెక్నో స్కూల్ నందు మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ  82వ జయంతి వేడుకలను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ముఖ్య అతిథిగా హాజరై, రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ…భారతదేశ ఆధునిక అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశంలో కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర అత్యంత కీలకమని గుర్తించిన రాజీవ్ గాంధీ , యువతకు రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించే దిశగా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు నేటి విద్యార్థులు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అందుకే విద్యార్థులతో కలిసి ఆయన జయంతి వేడుకలను నిర్వహించేందుకు శివాని టెక్నో స్కూల్‌కు విచ్చేశామని ఎమ్మెల్యే BLR తెలిపారు…ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed