సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానికా

ప్రజాలహరి మిర్యాలగూడ;భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ 1టౌన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో లేకపోవడం తీవ్ర విచారకరం. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద తెలంగాణ రాష్టంలో కోటి మందికి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఉచితంగా 5 కేజీల బియ్యాన్ని కేంద్రం ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కేజీ ఇచ్చి ప్రచార ఆర్బాటం చేస్తూ మేమే ఇస్తున్నాం, అని ప్రజలను ప్రలోబాలకు గురి చేస్తూ, ప్రభుత్వము ఏర్పడి 30 నెలలు అయినను ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేంద్రం ఇచ్చిన 3కోట్ల 76 లక్షల నిధులతో మాత్రమే అభివృద్ధి చేస్తూన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు ఖర్చు చేయడం లేదు. కేంద్రం సొమ్ముతో రాష్ట్రము సోకులు సరికాదు అని బీజేపీ మిర్యాలగూడ శాఖ డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో 1టౌన్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శి లు బంటు గిరి, కొంగరి వెంకటరమణ, మూల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి, సీనియర్ నాయకులు బంటు సైదులు కన్మంత్ రెడ్డి అశోక్ రెడ్డి, మొదాల అశోక్, గొనె కవిత, మండల సోములు, మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు, ఉబ్బపల్లి నంద,చిలుకూరి శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మారెడ్డి, మంద శివ, చిలుకూరి వెంకటేశ్వర్లు, దైవసోములు, మునగాల శివ, వెలిజాల ఏడుకొండలు, యాదగిరి, వేణు, శివయ్య, ప్రవీణ్,లు పాల్గొన్నారు

You May Have Missed