కామ్రేడ్ చల్ల సీతారాం రెడ్డి గారి సతీమణి లక్ష్మమ్మను పలకరించిన జూలకంటి రంగారెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ: పార్టీ ఎలా ఉంది కామ్రేడ్
రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా AIKS కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్నను పలకరించిన సాయుధ పోరాట వారోత్సవ యోధుడు అమరజీవి కామ్రేడ్ చెల్లా సీతారాం రెడ్డి గారి సతీమణి చల్లా ఆదిలక్ష్మమ్మ. ఈ సందర్భంగా రంగన్న గారు మాట్లాడుతూ, నాడు నిజాం కు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడినటువంటి కామ్రేడ్ చల్లా సీతారామరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ నాటి రైతాంగ పోరాటం విజయవంతం కావడమన్నా, భూమి లేని నిరుపేదలకు భూమి పంచడం జరిగిందన్నా, పోరాటంలో పాల్గొన్న వారితో పాటుగా కుటుంబాలను కాపాడుకున్నటువంటి నాటి స్త్రీలు కూడా ఆ పోరాటంలో పరోక్షంగా పాల్గొన్న వారేనని ఈ సందర్భంగా వారు కొనియాడారు. చల్లా ఆది లక్ష్మమ్మ ని పరామర్శించిన జూలకంటి. నాటి తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం. రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి నాటి సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ చెల్లా సీతారాం రెడ్డి గారి సతీమణి చల్ల ఆదిలక్ష్మమ్మను మంగళవారం వారి స్వగృహమునందు కలిసి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ పరిస్థితి ఎలా ఉందని పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. జూలకంటి సమాధానం ఇస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో సాధించిన విజయాలను అవి నేటితరం యువకులకు ఎలా ఉపయోగపడాలో పార్టీ శ్రేణులకు తెలుపుతూ వారిలో నూతన ఉత్సాహాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా నాడు నిజాం కు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడినటువంటి యోధులకు వారి భార్యలు ఇచ్చే సలహాలు గొప్పవని తెలిపారు. ఆ క్రమంలో కామ్రేడ్ చల్లా సీతారామరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ నాటి రైతాంగ పోరాటం విజయవంతం కావడా నికి ఆమె సహకారం గొప్పదని తెలిపారు, భూమి లేని నిరుపేదలకు భూమి పంచడం నాటి పోరాట ఫలితంగా జరిగిందన్నారు. ఆనాటి ఉద్యమం స్ఫూర్తి నేటికి కొనసాగుతుందని పేద ప్రజల కష్టాలను రూపుమాపేందుకు పార్టీ అనేక పోరాటాలు చేస్తుందని తెలిపారు. నేటి పాలకులు తమ స్వార్థం కొరకే పదవులను అంటిపెట్టుకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వీటిని ఎప్పటికప్పుడు పసిగట్టి పేదలకు అండదండగా ఉంటున్నామని వివరించారు. నాటి సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శమైందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఆమెను కలిసిన వారిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బి కార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, వారి కుమారుడు చల్ల చంద్రారెడ్డి, యువ నాయకుడు రవి నాయక్ పాల్గొన్నారు.

You May Have Missed