ఈ దేశ పురోగతికి కమ్యూనిస్టు ఉద్యమాలే కీలకం  కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి గారి 45 వర్ధంతి సభలో డబ్బికార్ మల్లేష్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈ దేశం అభివృద్ధి పదాన నడవాలన్న ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు పాలకులకు బుద్ధి చెప్పి ప్రజల హక్కులను సాధించే, కమ్యూనిస్టు ఉద్యమాలు కీలకమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్ పేర్కొన్నారు. ఈరోజు మిర్యాలగూడ మండలం రాయనిపాలెం గ్రామంలో సిపిఎం మిర్యాలగూడ ఉద్యమ నిర్మాణ కర్త,విప్లవ వీర కిశోరం, అమరజీవి కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి గారి 45 వర్ధంతి సభ రాయనిపాలెం గ్రామంలో వారి స్తూపం వద్ద నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగం ఇప్పటివరకు రక్షించబడుతుంది అన్న, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ కబంధహస్తాల కింద బందీ కాకుండా రక్షించబడుతున్నాయి అన్న, అంబానీ అదానిలాంటి బడా పెట్టుబడిదారులకు ప్రజా ఆస్తులు తాకట్టు పెడుతున్న వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించే కమ్యూనిస్టు పార్టీ చేసే ఉద్యమాలు ఈ దేశంలో ప్రజల హక్కులను కాపాడడంలో అగ్రభాగాన ఉన్నదని, ఈ సందర్భంగా వారు తెలిపారు. అటువంటి ఉద్యమాన్ని ప్రజలకు కూడు గూడు నీడ కోసం 1980 సంవత్సరం కంటే ముందు ఇంకా పూర్తిస్థాయి విద్య అందుబాటులో రాని కాలంలో ప్రజలందరిని చైతన్యవంతం చేసి వారికి భూమి పంచి, ప్రజా హక్కుల్ని గుర్తు చేసి, వారి పక్షాన పోరాడుతున్న సమయంలో కన్నుగీటిన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి వీరన్న ను హతమార్చిన ఒక వీరుడు మరణిస్తే వేలకొలది వీరులు ఉదయిస్తారనీ అలాగే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీ పరిపాలన చేసి గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదాన నడిపిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. విద్యార్థుల కోసం యువకుల కోసం అహర్నిశలు కృషి చేసిన వారి ఆశయ సాధన కోసం నేటి విద్యార్థి లోకం యువజన లోకం పాటుపడాలని కుల, మతాలకు వ్యతిరేకంగా విశాలమైన సమ సమాజ స్థాపన కోసం పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్,జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి,పాదూరి శశిధర్ రెడ్డి,భావండ్ల పాండు, సిపిఎం సీనియర్ నాయకురాలు గాదే పద్మమ్మ, నాయకులు కొన్ రెడ్డి వెంకటరెడ్డి, నాయకులు పాదురు గోవర్ధన్, పట్టం రామచంద్రయ్య, కందుకూరు రమేష్ బాబు, సైదా నాయక్,,జగన్,కన్నెకంటి రామకృష్ణ, పొదిలా శ్రీనివాస్,చౌగాని వెంకన్న,దేశిరామ్ నాయక్,పాదూరి గోవర్ధన్,వస్కుల సూర్యం,బ్రహ్మచారి,ఆశీర్వాదం,రాజు గోవిందు,వరప్రసాద్, పట్టేటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నరు

You May Have Missed