ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ
ప్రజాలహరి మిర్యాలగూడ; ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ అన్నారు. పట్టణంలోని యన్ యస్ పి క్యాంపు ప్రాథమిక పాఠశాల నందు శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ ల పుత్రుడు పద్మాకర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు భోజనం చేయడానికి వీలుగా 150 ప్లేట్లను బాలకృష్ణ , నవీన్ కుమార్ , పద్మాకర్ ల చేతులమీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైస్ చైర్ పర్సన్ శిరీష – నవీన్ కుమార్ పాఠశాల సందర్శించినప్పుడు విద్యార్థినీ విద్యార్థులు చిన్న చిన్న ప్లేట్లలో మరియు బాక్సులలో మధ్యాహ్న భోజనం తినడం చూసి వెంటనే ప్లేట్లు అందజేసినట్లయితే వారు సంతృప్తిగా భోజనం చేస్తారని గ్రహించి ,వారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ప్లేట్లు అoదించడం అభినందించదగిన విషయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని,దాతలు కూడా ముందుకు రావాలని వారు కోరారు. గుడిపాటి నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్, ప్రహరీ, డిజిటల్ విద్యా సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరో గ్రంథాలయ ఉద్యమకర్త కస్తూరి ప్రభాకర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాష్య , ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి , లక్ష్మీనారాయణ ,జానయ్య ,ఇందిరా ,వెంకటలక్ష్మి ,సిబ్బంది భూలక్ష్మి , బిబి ,ఆయేషా , మదారమ్మ ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



