సాగర్ఎడమ కాలువ పరిధిలోని మేజర్లు, మైనర్లకు నీటి విడుదల చేయాలి. లేకపోతే పోరాటం తప్పదు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయసింహారెడ్డిలు డిమాండ్

మిర్యాలగూడ ప్రజాలహరి……..సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’ ……… మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు ,విజయసంహారెడ్డిలు

మిర్యాలగూడ ప్రజాలహరి

.నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాల‌గూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాల‌గూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. – మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు ఉందని, మరో ఏడు అడుగులు అయితే ప్రాజెక్టు నిండుతుందని, ఈ దశలో అక్కడ విద్యుత్ తయారు చేసి సాగర్ ప్రాజెక్టుకు వదిలినట్లయితే ఆ నీటితో ఎడమ కాల్వకు రెండు పంటలకు నీటి విడుదల చేయవచ్చన్నారు. ఇప్పటికే ఎడమకాల పరిధిలోని పరిధిలో చాలామంది రైతులు వరి నార్లు వేసుకొని వ్యవసాయానికి సిద్ధమయ్యారని ఈ దశలో వరినారు నీరులోకి ఎండిపోతుందని రైతును ఆదుకోవాల్సిందే ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఎడమ కాలు తోపాటు మేజర్లు మైనర్లకు నీటి విడుదల చేయడం వలన భూగర్భ జలాలు నిలువల సామర్థ్యం పెరగడమే కాకుండా పంట పొలాలను బతికించిన వారం అవుతామని అదేవిధంగా తాగునీటికి కూడా కొరత ఉండదని తెలిపారు. నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా నీటి విడుదలపై నోరు మెదపడం లేదని, అదే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ర్రావు, భట్టి విక్రమార్కతోపాటు నల్లగొండ జిల్లా ఆయకట్టు పరిధిలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బీఎల్ఆర్, పద్మావతి ఉన్నారని, సాగునీటిపై వీరు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్‌నినో ఏర్పడింది, నీటి కొరత ఉంటుందని అవగాహన లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ తయారీని నిలిపి వేశారని, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించిన సందర్భంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్‌ తయారు చేసి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే కేవలం విద్యుత్ తయారీ, నీటి నిల్వ కోసమే ఏర్పాటు చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని, ఈ విషయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారని తెలిపారు. అక్రమ నీటి తరలింపుపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలపై సలహాలు స్వీకరించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల చేయనట్లయితే రైతులతో కలిసి ఛలో సాగర్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ డ్డి, హాతీరాం, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, ఎండి. యూసుఫ్, ఇలియాస్, పాచ్చునాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి ఉన్నారు.

You May Have Missed