ప్రభుత్వ హామీల కమిటీ (Assurance Committee) చైర్మన్‌గా ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతల స్వీకరణ

ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ శాసన మండలిలో జరిగిన Assurance Committee (2026–27) ప్రాథమిక సమావేశంలో చైర్మన్‌గా పాల్గొని కమిటీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా గౌరవ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ గా, కమిటీ సభ్యులు భాను ప్రసాద్ , రవీందర్ , మధుసూదన్ గా, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు నరసింహాచారి , తిరుపతి, ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.

You May Have Missed