భూత వైద్యులను నమ్మొద్దు పోలీస్ వారి హెచ్చరిక

*నాటు వైద్యులను,భూత వైద్యులను నమ్మవద్దు*…

* నకిలీ బాబా అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం.

* మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి

పూజలు,మంత్రాలు మరియు యంత్రాల పేరుతో అమాయక ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ,వారి వద్ద నుండి బంగారం మరియు నగదును అక్రమంగా తీసుకుంటున్న నిందితుడిని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖర రాజు పర్యవేక్షణలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
*నిందితుని వివరాలు:*
కోన వినోద్ కుమార్ అలియాస్ వినోద్
తండ్రి రాములు,వయస్సు 36 సంవత్సరాలు గల వ్యక్తి గట్టికల్ గ్రామము, ఆత్మకూర్(ఎస్) మండలము, సూర్యాపేట జిల్లాలో
వ్యవసాయం మరియు ఆయుర్వేదిక డాక్టర్ అని చెప్పుకుంటూ పలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాడని పత్రిక ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది.
*నేర ప్రవృత్తి – మోసం చేసిన తీరు:*
నిందితుడు నాటు వైద్యంతో పాటుగా,మంత్రాల పేరుతో అమాయక ప్రజలను టార్గెట్ చేసేవాడు.మిర్యాలగూడలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఒక మహిళ వద్దకు వెళ్లి,ఆమె భర్తకు ప్రాణహాని ఉందని భయపెట్టి అనేక పూజల పేరుతో సుమారుగా 5.7 తులాల బంగారం మరియు 13,200 రూపాయల నగదును తీసుకున్నాడని, అలాగే పూజ చేసే సమయంలో బాధితుల కళ్లను మూసుకోమని చెప్పి, ముడుపు పేరుతో తీసుకున్న బంగారాన్ని నిశబ్దంగా దొంగిలించి పరారయ్యేవాడని తదితర వివరాలను తెలియజేయడం జరిగింది.
*స్వాధీనం చేసుకున్న సొత్తు:*
నిందితుడి నుండి సుమారుగా 30 గ్రాముల బంగారపు చైన్,
ఒక వివో వి 29ఇ 5జి కి చెందిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని వాటిని నిందితుడి తోపాటుగా కోర్టులో అప్పగిస్తామని తెలియజేయడం జరిగింది.
*ఇతర నేరాలు:*
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో పెళ్లి పేరుతో 6 తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని అలాగే నకిరేకల్ (చందుపట్ల) లో ఒక కుటుంబాన్ని బెదిరించి బంగారం తీసుకున్నాడని నూతనకల్ లో కూడా వారం రోజుల్లో వ్యక్తి చనిపోతారని భయపెట్టి బంగారం,వెండి,నగదును కుటుంబ సభ్యుల నుండి దొంగిలించాడని వాటి వివరాలను వెల్లడించడం జరిగింది.
*పోలీసుల హెచ్చరిక:*
నకిలీ నాటు వైద్యులను, భూత వైద్యులను,బాబాలను నమ్మి మోసపోవద్దని మిర్యాలగూడ పోలీస్ సిబ్బంది మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలను హెచ్చరించారు.ఈ కేసును ఛేదించిన సిఐ సోమనర్పయ్య,ఎస్ఐ రాంబాబు మరియు వారి సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ అభినందించటం జరిగింది.

You May Have Missed