చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేనేత పరిశ్రమ మరియు వాడకం గురించి మాట్లాడుతూ
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ)\”నేస్తాలారా, 1905, ఆగస్టు 7… మనం దాన్ని మరచిపోకూడదు. 1905, ఆగస్టు 7న మన దేశ స్వాతంత్య్రం కోసం స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమమే ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పునాది వేసింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశప్రజలు ఒక గొప్ప పోరాటం చేశారు, ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 7న ‘చేనేత దినోత్సవం’ (హ్యాండ్లూమ్ డే) జరుపుకుంటున్నాము. ఎంతో ఉత్సాహంతో, వేడుకగా ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే— చేతివృత్తుల ద్వారా, కుటుంబంతో కలిసి స్వయంగా దుస్తులు తయారు చేసే ప్రతీ పేద చేనేత కుటుంబాన్ని ప్రోత్సహించడమే. చేనేత వస్త్రాలలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం స్వయంగా చూస్తున్నాం, ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చేనేత ఉత్పత్తుల వైవిధ్యం, మన చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా వేదికలు కల్పిస్తున్నాము. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడంతో పాటు ప్రతీ పేద చేనేత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే మన ప్రధాన కర్తవ్యం. రండి, మనమందరం స్వయంగా కొద్దిగానైనా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం, దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తయారు చేసి దేశ విదేశాలలో ప్రచారం చేద్దాం. మన చేనేత సోదరీసోదరీమణుల ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెబుదాం.అంటూ అందరికీ ఆగస్టు 7 ‘చేనేత దినోత్సవ’ శుభాకాంక్షలు.\”తెలియజేశారు వాడుక గురించి మాట్లాడుతూ
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ)”నేస్తాలారా, 1905, ఆగస్టు 7… మనం దాన్ని మరచిపోకూడదు. 1905, ఆగస్టు 7న మన దేశ స్వాతంత్య్రం కోసం స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమమే ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పునాది వేసింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశప్రజలు ఒక గొప్ప పోరాటం చేశారు, ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 7న ‘చేనేత దినోత్సవం’ (హ్యాండ్లూమ్ డే) జరుపుకుంటున్నాము. ఎంతో ఉత్సాహంతో, వేడుకగా ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే— చేతివృత్తుల ద్వారా, కుటుంబంతో కలిసి స్వయంగా దుస్తులు తయారు చేసే ప్రతీ పేద చేనేత కుటుంబాన్ని ప్రోత్సహించడమే. చేనేత వస్త్రాలలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం స్వయంగా చూస్తున్నాం, ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చేనేత ఉత్పత్తుల వైవిధ్యం, మన చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా వేదికలు కల్పిస్తున్నాము. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడంతో పాటు ప్రతీ పేద చేనేత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే మన ప్రధాన కర్తవ్యం. రండి, మనమందరం స్వయంగా కొద్దిగానైనా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం, దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తయారు చేసి దేశ విదేశాలలో ప్రచారం చేద్దాం. మన చేనేత సోదరీసోదరీమణుల ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెబుదాం.అంటూ అందరికీ ఆగస్టు 7 ‘చేనేత దినోత్సవ’ శుభాకాంక్షలు.”తెలియజేశారు

