మాస్టారు”….మీరే మా “స్టారు”…సమాజ సేవలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు షరీఫ్ సమాజసేవలో స్పూర్తి ఉపాధ్యాయులు షరిఫ్

ప్రజాలహరి మిర్యాలగూడ;చదువు తో పాటు సమాజ సేవలో విద్యార్థులకూ యువతకు ఆదర్శం గా నిలిచిన పేరూరు గ్రామనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు షరీఫ్ సమాజం మనకేం చేసింది అనే ధోరణి లో ఆలోచించకుండా సమాజం కి మనమేం చేయ్యగలం అనే నినాదం తో ముందుకుసాగుతున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలనుండి భోదన వృత్తి లో ఉంటూ ఎందరో విద్యార్థులని వివిధ రంగాల్లో ప్రతిభవంతులుగా తీర్చిదిద్ది నేటీ యువత ఆన్లైన్ బెట్టింగ్ మాదక ద్రవ్యాల బారిన పడకుండా సమాజసేవలో భాగమై నిస్సహాయస్థితిలో ఉండే నిరుపేదలకి అండగా నిలవాలని పిలుపునిచ్చే ఉపాధ్యాయులు షరీఫ్ గారికి నిస్వార్ధ సమాజసేవకులని గుర్తించి వారిని గౌరవిస్తూ అమీర్అలి ఫౌండేషన్ ఆవార్డ్ కి ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్బంగా అమీర్అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్అలి మాట్లాడుతూ వారు పని చేసే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ,నాన్న లేని పిల్లలకు దుస్తులు కొనివ్వడం…వారి దగ్గర చదువుకొని పై చదువులకు ఇబ్బంది కల్గిన సందర్భంలో ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చెయ్యడం, సమాజంలో ఉన్న రాజకీయ నాయకుల ద్వారా మరియు పోలీస్ ఆఫీసర్ల ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయించడం లో వీరికి వీరే సాటి…సార్ దగ్గర చదువుకున్న ఎందరో విద్యార్థులు ఈ రోజు SI లు గా కానిస్టేబుళ్లు గా ,వివిధ రంగాల్లో కొనసాగడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు…పేద విద్యార్థులకు ” పెద్దన్న” గా ఉండే షరీఫ్ సార్ భవిష్యత్తులో ఇంకా గొప్ప సేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుందాం షరీఫ్ సార్ గారి వద్ద చదువు తో పాటు పెద్దలని గౌరవించడం సాటిమనిషికి సహాయం చేసే తత్త్వం నేర్చుకున్నాను అమీర్అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు లో ప్రత్యక్షం గా పరోక్షంగా సహకరించే మా గురువు గారికి ఆవార్డ్ ఇవ్వటం నా గురు దక్షణ గా భావిస్తున్నాను నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులకు అందరివాడుగా ఉండే ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వేలమంది శిష్యులులో నేను ఒకడిని అన్నారు అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు షరీఫ్ గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే అరుదైన సంపదలు చదువు మానవత్వం విజ్ణానం చదువు నేర్పితే వస్తూంది మానవత్వం సాటీ మనిషి కష్టం చూసి చలించే హృదయం మనదైతేచాలు విజ్ణానం అనేది అగని విద్య లాంటిది ఎంత నేర్చుకున్న ప్రతిరోజు ఎంతోకొంత విజ్ణానం నేర్చుకోవచ్చూ అన్నారు

You May Have Missed