మిర్యాలగూడ మండల ప్రజలు, రైతుల విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ మండలంలోని గ్రామాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా మరో కీలక అడుగు పడింది… ఈ మేరకు మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదిత స్థలాన్ని ఈరోజ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR , RDO రమణా రెడ్డి గారు, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థల అనుకూలత, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలను అధికారులతో సమీక్షించారు… అనంతరం సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన అన్ని పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR మాట్లాడుతూ, మండలంలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు… నూతన సబ్‌స్టేషన్ నిర్మాణంతో విద్యుత్ లోడ్ తగ్గి, వోల్టేజ్ సమస్యలు పరిష్కారమవడంతో పాటు ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు… ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత మండలంలోని పలు గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Previous post

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆరో తేదీ నుంచి ప్రజా చైతన్య యాత్రలు  సీపీఐ బంటు

Next post

రెడ్డపాక చంద్రమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

You May Have Missed