సిరిసిల్ల మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ; రోజు సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మహాసభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పరిశీలించారు.ఈ సందర్భంగా మహాసభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను నాయకులు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



