యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పొలిటికల్ హైటెన్షన్

ప్రజాలహరి మిర్యాలగూడ;వీర్లపాలెం వైపు భారీగా కదులుతున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.ప్లాంట్ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు..ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు,మిర్యాలగూడ బీఆర్ఎస్ శ్రేణులు.. ప్లాంట్‌కు దూరంగానే భారీ కేడ్లు ఏర్పాటు చేసి నేతలను,కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి బృందం ప్లాంట్ వద్దకు చేరుకునే అవకాశం…ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణాలేంటి..? అధికారులను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధం కాగా విద్యుత్ రంగంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపణలు…మరోవైపు యాదాద్రి ప్లాంట్‌ను దసరా నాటికి పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది… బొగ్గు సరఫరా సమస్యపై ఇప్పటికే ప్రభుత్వం సమీక్ష.  ప్లాంట్ పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం.. ఒకవైపు భారీ పోలీస్ బందోబస్తు.. మరోవైపు బీఆర్ఎస్ బృందం పర్యటన యాదాద్రి ప్లాంట్ వద్ద ఏం జరగబోతోంది అనేది వేచిచూడాల్సిందే

You May Have Missed