జిల్లా రైఫిల్ షూటింగ్లో నలుగురు కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల ఎంపిక కు హర్షం

కోదాడ SRM ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ మీట్‌లో 20/09/2026 కేంద్రీయ విద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొని, తమ అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు:

• అండర్-14 – ఓపెన్ సైట్ షూటింగ్: D. హర్షిత్ రాథోడ్

• అండర్-17 – PCP షూటింగ్: ప్రణతి & శ్రీలాస్య

• అండర్-19 – ఓపెన్ సైట్ షూటింగ్: నిఖిల్ విద్యార్థులను నూకల ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి జూనియర్ కాలేజీలో వీరిని అభినందించడం జరిగినది. ఇంకా వీరు జాతీయస్థాయిలో ఎదగాలని రైఫిల్ షూటింగ్ గేమ్ ఒలింపిక్స్ లో కూడా ఉందని, ఒలంపిక్స్ వరకు చేరుకొని మిర్యాలగూడకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదించినారు . పీఇటి సతీష్ గారు మాట్లాడుతూ ఈ విజయం మాkgbv పాఠశాలకు ఎంతో గర్వకారణం. విద్యార్థుల అంకితభావం, కష్టపడి చేసిన సాధన మరియు నిరంతర అభ్యాసం వల్ల ఈ విజయాన్ని సాధించారు అని తెలియజేసినారు.మా విద్యార్థులను నూకల Foundation చైర్మన్ నూకల వేణు గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షులు మరియు కేంద్రీయ విద్యాలయ ఇంచార్జి ప్రిన్సిపాల్ రవి సార్ ఆశీర్వదించి, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచేలా మీ ప్రోత్సాహం మరియు ఆశీస్సులు అందించారు. స్పోర్ట్స్ కోచ్ సతీష్ ను అభినందనాచారు. నూకల ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్ చాలా ఉపయోగపడిందని కోచ్ సతీష్ మరియు తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిలు వెంకటేశ్వర్లు సార్, వెంకటరత్నం సార్, జనార్ధన్, అశోక చారి, నాగరాజు, గుడిపాటి కృష్ణ, పాతూరు శరత్, అనిల్ పాల్గొన్నారు

Previous post

ఉద్యమమే ఊపిరిగా జీవించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి “తెలంగాణ ఉద్యమ దిక్సూచి” ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ.      

Next post

సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బెజ్జం సాయి నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం నియామకం

You May Have Missed