ఉద్యమమే ఊపిరిగా జీవించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి “తెలంగాణ ఉద్యమ దిక్సూచి” ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ.
ప్రజాలహరి మిర్యాలగూడ;కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్.కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువకులు నడుంబించి పాటుపడుతూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2027 జనగణన లో కులగణనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ గెజిట్లో పదవ ప్రశ్న కాలంలో మీరు ఎస్సి నా మీరు ఎస్టీ నా ఇతరులు అని చేర్చి ఓబీసీలకు సంబంధించిన ఓబీసీ కాలం లేకపోవడం ఓబీసీలను లెక్కించకపోవడం మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం చాలా అన్యాయం అన్నారు కులానికి ఒక యూనిక్ కోడు కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయాలి. పదివేల లోపు ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలి. ర్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. దేశంలో జంతువులకు లెక్కలు ఉంటాయి కానీ ఓబీసీలకు లెక్కల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణలో ఓబీసీ కాలం చేర్చాలి అని బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, వెట్టి చాకిరి సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు, తెలంగాణ హక్కుల కోసం పదవులను సైతం త్యాగం చేసి ప్రజా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర సమరయోధుడిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కొండ లక్ష్మణ్ బాపూజీ తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా సర్వస్వం ధారాబోశారని అన్నారు. స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షిస్తూ తన మంత్రి పదవికి సైతం రాజీనామాను చేశారన్నారు. 96 ఏళ్ల వయసులోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ధీశాలి అని అన్నారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడకుండానే తుది శ్వాస విడిచారని అన్నారు. కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలన్నారు దేశంలో జంతువుల లెక్కలు తీసేందుకు ప్రాధాన్యతమిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనాభాలో సగభాగం ఉన్న ఓబీసీల లెక్కలు చేయడానికి ఎందుకు భయపడుతుందో తెలియాలి అని అన్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని హోదాలో బీసీ వ్యక్తి ఉన్నప్పటికీ ఓబీసీలకు తగిన న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమన్నారు. ఓబీసీల సరైన జనాభా లెక్కలు తేలితేనే వారికి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో దక్కాల్సిన వాటా దక్కుతుందని అన్నారు బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని విమర్శించారు ఇప్పటికైనా ఓబీసీల లెక్కలు తేల్చకపోతే కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా బీసీలందరూ ఐక్యమై తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో!! బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక , బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బాసాని గిరి రజక, బీసీ విద్యార్థి సంఘం పట్టణ కార్యదర్శి నక్క నాగరాజు ముదిరాజ్, సామాజికవేత్త తెలంగాణ ఉద్యమకారుడు మైనార్టీ మాజీ మండల అధ్యక్షులు యం డీ మహమూద్ కొత్తగూడెం , బీసీ యువజన నాయకులు చిలుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు



