మెగా జాబ్ మేళాలో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ;నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోదాడ పట్టణంలో మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది… ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR తో కలిసి మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ…యువత తమ విద్యా అర్హతలు, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.ఇలాంటి మెగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లభించడం అభినందనీయమన్నారు.యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషికి ఆయన అభినందనలు తెలిపారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR శుభాకాంక్షలు తెలియజేశారు…

You May Have Missed