గణేష్ నిమజ్జనంలో పులిహోర ప్యాకెట్ల పంపిణీ

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మరియు BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి తరలివచ్చిన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి నిమజ్జనం కోసం వాడపల్లి కృష్ణానది ఘాట్‌కు చేరుకున్న వేలాది మంది భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు సమీపంలో ఉంటూ ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు మేరకు, BLR బ్రదర్స్ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు BLR అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులకు సేవలు అందించారు. భక్తుల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ మరియు BLR బ్రదర్స్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు భక్తజనం ఎంతగానో అభినందించారు.

Previous post

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ 

Next post

మెగా జాబ్ మేళాలో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

You May Have Missed