గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు

ప్రజాలహరి (హాలియా);పురపాలక సంఘం హాలియా:గౌరవ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా అనుముల మండల పరిధిలోని 14వ మైలు చెక్‌పోస్ట్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి , మున్సిపల్ కమిషనర్ కే. రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పూర్ణచందర్ , ఎంపీడీవో మజీద్ , సీఐ రాఘవరావు , ఎస్సై సాయి ప్రశాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు మరియు భక్తులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలో అవసరమైన భద్రతా, పారిశుద్ధ్య, మౌలిక వసతుల ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టేలా అధికారులు పర్యవేక్షించారు.

You May Have Missed