చదువుతో పాటు క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;దామరచర్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో చదువుతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఈరోజు ప్రారంభించారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR క్రీడా పోటీలను తిలకిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు… అనంతరం విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి మండలానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే BLR ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు… ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



