నిర్లక్ష్యపు నీడలో విద్యుత్ శాఖ పట్టించుకోని అధికారులు

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

మిర్యాలగూడ విద్యుత్ వ్యవస్థలో ఎన్నో లుకలుకలు నిర్లక్ష్యాలు చోటు చేసుకున్న సందర్భాలను ప్రజలు గమనిస్తున్నారు అయినా అధికారులు చూసి చూడనట్లు ఉండడం అత్యంత బాధాకరం మిర్యాలగూడ లో పలు వార్డులలో శాంతినగర్ సంతోష్ నగర్ చౌదరి కాలనీ చైతన్య నగర్ బంగారుగడ్డ సీతారాంపురం వంటి మరికొన్ని వార్డులలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది నాణ్యమైన విద్యుత్తును అందించడంలో అధికారులు విఫలమయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు ఎటువంటి గాలి దుమారం లేకపోయినా వర్షం లేకపోయినా గంటల తరబడి విద్యుత్ అంతరాయాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు కానీ లైన్మెన్ లు గాని అధికారులు కానీ దీనిపై దృష్టికి సాధించకపోవడం ప్రజలను అత్యంత బాధకు గురిచేస్తుంది సకాలంలో బిల్లు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని కఠిన తరమైన నియమాలను ప్రజలపై ప్రయోగించే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా విషయంలో ఇటువంటి నియమాలను ఎందుకు పాటించటం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పలు వార్డు కౌన్సిలర్లను సైతం లైన్మెన్లు దురుసుగా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం అయినా విద్యుత్ అధికారులకు చలనం రావడం లేదు మిర్యాలగూడ అభివృద్ధి మాటేమో కానీ ఉన్న సౌకర్యాలను కనీసం ఉపయోగించుకునే విధంగా చూడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు గత రెండు నెలలుగా ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను కనీసం పట్టించుకోకుండా సమస్య జటిలమైనప్పుడు అప్పటికప్పుడు పునరుద్ధరణ ఎలాగ అవుతుంది అనుకుంటారో కానీ సవ్యంగా ఉన్నప్పుడు సమస్యలు ఏందో తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అనేది ప్రజాభిప్రాయం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ప్రజలు వాపోతున్నారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు

You May Have Missed