ఆర్టీసీ బస్టాండ్ హమాలీ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతంరెడ్డి
ప్రజాలహరి మిర్యాలగూడ ; జిల్లాలోని ఏడు బస్ డిపోలో పరిధిలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక బస్టాండ్ లో హమాలీ పని చేస్తున్న కార్మికులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. హమాలీ కార్మికులు ఇబ్బంది లు ఎదుర్కొంటున్నారని ఐదు కేజీల బరువును వస్తువులకు హమాలీ ఈయటం లేదని ఇది పూర్తిగా కార్మికులను దోచుకునే చర్య అని విమర్శించారు. ప్రస్తుతం వివిధ బస్టాండ్ పరిధిలో గల పార్సల్ కేంద్రాలను పూర్తిగా అవేజె సంస్థకు ప అప్పజెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని దీన్ని తమ సంఘం వ్యతిరేకిస్తుందని తెలిపారు. పార్సల్ కేంద్రాల వద్ద గతంలో ఆర్టీసీ సిబ్బంది పని చేయించే వారిని ప్రస్తుతం వారి స్థానంలో ప్రైవేటు వారితో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పరం చేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీలను తొలగించే ప్రమాదం ఉందని అలా కాకుండా పనిచేస్తున్న వారినే కొనసాగించాలని ఆయన తెలిపారు. ఈ పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 బస్ డిపోలలో జరుగుతుందని ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైందని వారు తెలిపారు. యాజమాన్యం కార్మికులకు న్యాయం చేయాలని వారికి ఈఎస్ఐ పీఎఫ్ వంటివి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటుగా హమాలీలు రామకోటయ్య సురేష్ ఎల్లయ్య కృష్ణయ్య యాదయ్య వెంకన్న వీరయ్యలు ఉన్నారు.



