చిల్లాపురం గ్రామంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పల్లె నిద్ర

ప్రజాలహరి మిర్యాలగూడ;ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా చిల్లాపురం గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR పర్యటన**

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామాల సమగ్ర పురోగతి లక్ష్యంగా చేపట్టిన **”ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట”** కార్యక్రమంలో భాగంగా

మిర్యాలగూడ శాసనసభ్యులు **బత్తుల లక్ష్మారెడ్డి -BLR** గారు

ఈరోజు **మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామపంచాయతీ**లో పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై వారి నుంచి నేరుగా వివరాలు తెలుసుకున్నారు…ప్రజల సూచనలు, వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు…అనంతరం గ్రామస్థులతో ఆప్యాయంగా మమేకమై, ప్రభుత్వ పాఠశాలలో రాత్రి బస చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు…గ్రామ ప్రజలతో కలిసి వారి జీవన విధానాన్ని తెలుసుకుంటూ, గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై అధికారులతో చర్చించారు…రేపు ఉదయం గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు **ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం** నిర్వహించి, గ్రామ ప్రజలతో మరోసారి సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

You May Have Missed