కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ పని చేయాలి …ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

*ప్రజాస్వామ్యానికి పునాది బూత్ లెవెల్ ఏజెంట్లు: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి –

మిర్యాలగూడ ప్రజాలహరి

 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – ఆధ్వర్యంలో

 

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLAs) శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది…

 

ఈ కార్యక్రమానికి *ప్రభుత్వ విప్ MLC బల్మూరి వెంకట్ గారు*మరియుMLC *శంకర్ నాయక్నల్గొండ డీసీసీ అధ్యక్షులు *పున్నా కైలాష్  రంగారెడ్డి మాజీ డీసీసీ *మాసనపల్లి లింగాజీ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR గారు మాట్లాడుతూ…

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది ఓటరు జాబితా. ప్రతి అర్హుడైన వ్యక్తికి ఓటు హక్కు కల్పించేలా BLAలు బాధ్యతాయుతంగా పనిచేయాలి…

 

బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీకి మరియు ప్రజలకు మధ్య వారధిలా ఉంటారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ మరియు ఓట్ల తొలగింపు ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు..

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలన్నారు…

 

ఈ శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs), తదితరులు పాల్గొన్నారు…

Previous post

నల్గొండ జిల్లా వక్స్ బోర్డు ర్యాలయం పై మరియు వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ పోలీసులు

Next post

అడ్వాన్స్డ్ ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల ప్రభంజనం

You May Have Missed