డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

*మిర్యాలగూడలో అంబేద్కర్‌ జయంతి వేడుకల సన్నాహక సమావేశం.*

 

అందరినీ కలుపుకుని వేడుకలను విజయవంతం చేద్దాం – *ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR…*

మిర్యాలగూడ ప్రజాలహరి

భారత రాజ్యాంగ నిర్మాత *డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ గారి* జయంతి వేడుకలను మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారి* ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి…

 

సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు…

 

ఈ ఏడాది నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు (MP) *కుందూరు రఘువీర్ రెడ్డి* ,నకిరేకల్ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ *వేముల వీరేశం .. ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ *అద్దంకి దయాకర్  పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు…

 

సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అంబేద్కర్ ఆశయాలు కేవలం ఒక్క వర్గానికి పరిమితం కావని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులే నేడు మనకు మార్గదర్శకాలని కొనియాడారు…

 

రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు కలిసికట్టుగా ఉండి ఈ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా, విజయవంతం చేయాలని ఆయన కోరారు.సాధారణంగా ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యే స్వయంగా పిలిచి, ప్రజా సంఘాల అభిప్రాయాలను సేకరించడంపై నాయకులు సంతోషం వ్యక్తం చేశారు…

 

ఎమ్మెల్యే చొరవను అభినందిస్తూ, వేడుకల విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

 

ఈ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

You May Have Missed