సీనియర్ బిఆర్ఎస్ నేత జొన్నలగడ్డ రంగారెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
*తెలంగాణ ఉద్యమకారులు జొన్నలగడ్డ రంగారెడ్డిని పరామర్శించిన మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు జొన్నలగడ్డ రంగారెడ్డి ని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఇటీవల కంటి చికిత్స విజయవంతంగా చేయించుకుని స్వగృహమైన మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామం చేరుకున్న ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజా సేవలో మరింత చురుకుగా ముందుండాలని ఆకాంక్షించారు.
వారి వెంట హాట్టి నాయక్ , తిరందాస్ విష్ణు తదితరులు ఉన్నారు.


