ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

*సామాన్యుడితో కలిసి ముద్ద పంచుకున్న వేళ..మిర్యాలగూడలో వెల్లివిరిసిన ఆత్మీయత… 2కోట్ల, 55 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ*

మిర్యాలగూడ ప్రజాలహరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా

 

మిర్యాలగూడ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది…

 

ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో

 

స్థానిక క్యాంపు కార్యాలయంలో వినూత్నంగా ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు…

 

సన్నబియ్యం పథకం ద్వారా పేద ప్రజలకు అందుతున్న మేలును చాటిచెప్పేలా,*ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -BLR గారు* తన క్యాంపు కార్యాలయంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు.. స్వయంగా వడ్డించారు…

 

అనంతరం,తన కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య లబ్ధిదారుల సరసన కూర్చుని సహపంక్తి భోజనం చేయడం అందరినీ ఆకట్టుకుంది…

 

ప్రజాప్రతినిధులకు,ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి,అందరూ ఒకటే అనే భావనను ఈ కార్యక్రమం చాటిచెప్పింది…

 

ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా *ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు* హాజరయ్యారు…

 

ఆయనతో పాటు అధికారులు,స్థానిక మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా బాలు గారు*,

 

వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష నవీన్ గారు* ,పట్టణ నాయకులు, మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

 

ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల కృషిని, ప్రజల సహకారాన్ని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు….

భోజన విందు అనంతరం

 

పేదల సంక్షేమం దిశగా మరో ముందడుగు వేశారు…

 

*CMRF మరియు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా మంజూరైన 2 కోట్ల,, 55 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు…*

 

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ..

 

ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు…

 

సన్నబియ్యం పథకం ద్వారా సామాన్యుడికి నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు…

 

రాబోయే రోజుల్లో మిర్యాలగూడను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు…

Previous post

ఈ నెలాఖరు లోపు డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలి ..కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాలు

Next post

ఇంటర్ ఫలితాల్లో మిర్యాలగూడ కు చెందిన కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థుల టాప్ ర్యాంకుల ప్రభంజనం

You May Have Missed