మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి అధ్వర్యంలో.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి అధ్వర్యంలో.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ మాజీ *ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న BRS పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు*.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలు మరింత కొనసాగాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి,చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి,దుర్గంపూడి నారాయణ రెడ్డి,ఎండి.యూసుఫ్,జొన్నలగడ్డ రంగా రెడ్డి,ధనావత్ చిట్టిబాబు నాయక్,బైరం సంపత్,ఎండి.మగ్దుం పాషా, అంగోతు హాతిరాం నాయక్,మట్టపల్లి సైదులు యాదవ్, చౌగాని బిక్షం గౌడ్,పెద్ది శ్రీనివాస్ గౌడ్,చిర్ర మల్లయ్య యాదవ్, అమరావతి సైదులు,వేలిచేటి రామకృష్ణ,బంటు శ్రీనివాస్, పాశం నరసింహ రెడ్డి,పెండ్యాల పద్మ,షహనాజ్ బేగం,దైద సత్యం, BRS పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు* తెలిపారు.



