నేర నియంత్రణకు మిర్యాలగూడలో పోలీసులవిస్తృత తనిఖీలు

నేర నియంత్రణకు మిర్యాలగూడ పట్టణంలో తెల్లవారుజామున విస్తృత తనిఖీలు ..

నంబర్ ప్లేట్ లేని 11 ద్విచక్ర వాహనాలు, సరైన పత్రాలు లేని 27 వాహనాలు సహా మొత్తం 38 వాహనాలు సీజ్*

జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా పెంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ ఇంచార్జ్ డీఎస్పీ రవి గారి పర్యవేక్షణలో 1 టౌన్ సీఐ నాగభూషణ్,2 టౌన్ సీఐ సోమ నర్సయ్య,రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్,ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి మార్గాలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు, రద్దీ కూడళ్లు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాహనాల రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్న నంబర్ ప్లేట్ లేని 11 ద్విచక్ర వాహనాలు,సరైన పత్రాలు లేని 27 వాహనాలు సహా మొత్తం 38 వాహనాలను సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. అదేవిధంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను సేకరించారు. రాత్రి వేళల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు పాత నేరస్థుల కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడుతూ, నేర నియంత్రణ, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణంలో నేర నియంత్రణ లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Previous post

అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం, త్రాగునీటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

Next post

సీసీ రోడ్లు పగలగొట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో యూజీడీ పనులు చేపట్టాలి కౌన్సిలర్ శ్రీమతి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి

You May Have Missed