కొత్తగూడెం గ్రామంలోని రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో రైతు భరోసా నిధులు విడుదల రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యo ను తిలకిస్తున్న రైతులు
మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి -మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని రైతు వేదిక లోముఖ్యమంత్రి రైతు భరోసా నిధులు విడుదల ఆశీర్వాద ఆశీర్వాద సభ ను ఈ ప్రాంత రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించడం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం నుంచి రైతు భరోసా నిధులు 1009.15 కోట్ల రూపాయలు 1.44 లక్షల రైతులు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం (Live) చేయగా, మిర్యాలగూడ మండలం లోని కొత్తగూడెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (MAO) రుషేంద్రమని ఆధ్వర్యంలో సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ అభివృద్ధి గురించి వివరించారు, ఈ కార్యక్రమం లో కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,AEOs పార్వతి, నాగయ్య , అఫ్రీన్, గోపి ,రైతులు ఇజ్రాయెల్, సురేందర్ రెడ్డి, కోటిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు



