మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో SIR కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR).         

ప్రజాలహరి మిర్యాలగూడ;   మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో SIR కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR).          ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని  5,6,15,16,34,47 వార్డుల్లో కొనసాగుతున్న  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)  కార్యక్రమం నిర్వహణను      మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారు పర్యవేక్షించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు…                 ఈ సందర్భంగా వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే గారు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు…     ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా, వేగవంతంగా SIR కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.   అలాగే ప్రజలకు SIR కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచేసుకునేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు…  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

You May Have Missed