చిన్నపాటి వర్షానికి ప్రధాన రహదారులపై మోకాళ్ళ లోతు నీళ్లు

+చిన్నపాటి వర్షాలకి ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలుస్తున్నాయి..

+

 

@(మిర్యాలగూడ ప్రజాలహరి)అభివృద్ధిలో మిర్యాలగూడ నియోజకవర్గం రాష్ట్రానికి రోల్ మోడల్, దేశానికి రోల్ మోడల్ జాతీయ స్థాయిలో రూల్ మోడల్ ఇవి అందమైన పదాల అల్లికలు… ఆచరణలో మాత్రం ఈ పదాలు కనిపించవు వీటి వివరణలు కనిపించవు .

భూగర్భ డ్రైనేజీలు నిర్మాణాలు మరల నిర్మాణాలు డబుల్ ఓపెన్ డ్రైనేజీలు ఇవన్నీ కాగితాల మీదనే కనిపిస్తాయి. కానీ వాస్తవానికి వచ్చేవరకు మూడు నుంచి పది నిమిషాల్లోపు పడే వర్షానికి మిర్యాలగూడలో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోతాయి. ఇందుకు ఇటీవల కురిసిన వర్షాలే ఉదాహరణ. ఈ సమస్యపై మున్సిపల్ యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గం జిల్లా స్థాయి , ప్రజా ప్రతినిధులు, మిర్యాలగూడ లోని అన్ని రాజకీయ పార్టీలు వారికి వారే సమాధానం చెప్పుకోవాలి “గుమ్మడికాయ సామెత” ను ఎవరు ముందు వేసుకోవద్దు. మాటలు పదాల అల్లికలు కు స్వస్తి చెప్పండి. అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి . ఇది నేటి, నాటి కొత్త తరం నాయకత్వానికి సూచన

You May Have Missed