మిర్యాలగూడ పట్టణ వాసులు జర ఆలోచించండి…?

మిర్యాలగూడ వాసులము.. అభివృద్ధి చెందుతున్నామా లేక అనాగరికతవైపు పయనిస్తున్నాము??? (మిర్యాలగూడ ప్రజాలహరి) మిర్యాలగూడలో పట్టణవాసులము మనం అభివృద్ధి వైపు పైన పయనిస్తున్నామా ..లేక అనాగరికత వైపు వెళ్తున్నామా అన్నది ఎవరికి వారు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఒక ఓటు వేయడానికి ఆధార్ కార్డు ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ ఉన్న.. దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రశ్న ఎవరు సమాధానం చెప్పాలి. మరో ప్రశ్న నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గల్లాలు పట్టుకోవడం నేర్చుకోవడం ఒకరిపై ఒకరు దూషణలు చూస్తుంటే మనం యువతరానికి ఏమి సూచిస్తున్నాము అని అందరూ ఏవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు…

You May Have Missed