⭐పారా ఉషార్…. గిఫ్ట్ లు మందు ,మటన్ చికెన్లు వస్తున్నాయి?. తాయిలాలు.. అందుకోవడానికి సిద్ధంగా ఉండండి??
⭐పారా ఉషార్… ⭐మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు తాయిలాలు పట్టుచీరలు, డబ్బులు మందు, మటన్ ,చికెన్ పంపిణీకి రంగం సిద్ధం..
(ప్రజాలహరి, మిర్యాలగూడ) మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో చివరి రెండు రోజులు దగ్గర పడటంతో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో రెండు మూడు రోజుల ముందు నుంచే డబ్బులు చీరలు మందు చికెన్ మటన్ లో ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు??. ముఖ్యంగా చైర్మన్ పదవులు ఆశిస్తున్న వార్డుల్లో విపరీతంగా ధన ప్రవాహము గిఫ్ట్ పంపిణీ ప్రవాహము మందు మటన్ పంపిణీలు జరుగుతున్నాయి. గత 12 రోజులుగా ఉదయం పూట ప్రచారాలు మధ్యాహ్నం సాయంత్రం పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి నియోజకవర్గం మద్దతు ఇస్తున్నారు? ఇట్లా పంచుకుంటూ పోతే ఎంతవరకు ఎక్కడి వరకు!? ఓటర్లు ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉండండి వచ్చిన తాళాలు అందుకోండి అన్నట్టుగా కార్యకర్తలతో విషయాలు చేరవేస్తున్నారు. అభ్యర్థులు ఎప్పుడు తమ ఇంటికి వస్తారో ఎప్పుడు గిఫ్ట్ లు వస్తాయో అని ఆశగా “వర్షం కోసం రైతు ఆకాశం వైపు చుసినట్టుగా” ఓటర్లు గిఫ్ట్లు తాయాలా కోసం చూస్తున్నారు.? గిఫ్ట్ తీసుకుంటూ ఒక బాధ తీసుకోకు ఒక బాధ గిఫ్ట్ తీసుకోకపోతే కౌన్సిలర్ అభ్యర్థులు మనసులో పెట్టుకుంటారని ఓటర్లు ప్రజలు భయపడుతున్నారు అందుకోసమే వారికున్న సిద్ధాంతాలను పక్కకు పెట్టి గచ్చంతలేని పరిస్థితుల్లో ఈ గిఫ్ట్ ల కోసం వెంపర్లాడుతున్నారు. ఒక వార్డులో 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు వస్తే ఈ డబ్బులు ఆ వార్డు అభ్యర్థికి ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళ ఎట్లా పూడుచుకుంటారనే విషయం ఎవరు ఆలోచించండి ఉచిత పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు ఈరోజు వచ్చిందే లెక్క “రేపు తీనబోయే వన్యప్రాణి కంటే ఈరోజు తినే కా మేలు” అనే సామెత లా ఓటర్లు కూడా తయారయ్యారు. ఇంతవరకు గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. వార్డుల్లో మరి ఎక్కువైంది. మామూలు వార్డుల పరిస్థితి ఏమిటి? దీనికి సమాధానం పార్టీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న వారే చెప్పాలి.



