పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పిలుపు

*ప్రజాలహరి – మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ):* నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, పట్టభద్రుల ఓటు నమోదు మరియు ఓటర్లను చైతన్యపరిచే అంశాలపై సమావేశంలో చర్చించారు.

నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్రుడిని సంప్రదించి, ఓటు హక్కు ఉన్న వారందరూ తమ ఓటును నమోదు చేసుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed