మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో కరాటే విద్యార్థులకు బెల్ట్ ప్రమోషన్ పరీక్ష

ప్రజాలహరి మిర్యాలగూడ ;(హరిప్రసాద్ చీదళ్ళ);కరాటే పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ , వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా బెల్ట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని బుడిదె సైదులు గారు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీను మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థులు కరాటేలో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం మరియు ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.

You May Have Missed