పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి
ప్రజాలహరి మిర్యాలగూడ;కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులకు సూచించిన చిలుకూరి సుధా బాలకృష్ణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ పట్టణంలోని పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులతో సమావేశం నిర్వహించారు.మున్సిపల్ కౌన్సిలర్ చిలుకూరి సుధా బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని ప్రతి వార్డులో అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి, వారి ఓటు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు.ప్రతి కౌన్సిలర్, వార్డు ఇంచార్జి తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి, ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని చిలుకూరి సుధా బాలకృష్ణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…



