జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు జనయేత్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
ప్రజాలహరి మిర్యాలగూడ:మిర్యాలగూడ పట్టణంలోని జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. జనయేత్రి ఫౌండేషన్ మరియు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కామిశెట్టి సత్యనారాయణ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి వాకర్స్‌తో పాటు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి 17వ వార్డు కౌన్సిలర్, ఎన్‌వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో జీజేసీ గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాకర్స్‌తో పాటు పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అభినందించారు.అసోసియేషన్ అధ్యక్షులు కన్నెబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణ కాంత్ నాయక్ మాట్లాడుతూ.. పట్టణంలోని పేద ప్రజలు, వాకర్స్ ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతోనే ఈ క్యాంప్ ఏర్పాటు చేశామని, దీనికి సహకరించిన జనయేత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మునీర్, కామిశెట్టి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వైద్య విభాగాల్లో పలువురు ప్రముఖ నిపుణులు పాల్గొని రోగులను పరీక్షించారు: డాక్టర్ బాలాజీ – జనరల్ ఫిజీషియన్, డాక్టర్ నాగేశ్వరరావు – మెడికల్ ఆఫీసర్, డాక్టర్ నాగు నాయక్ – దంత వైద్య నిపుణులు, డాక్టర్ వికాస్ – కంటి వైద్య నిపుణులు,డాక్టర్ రాంబాబు – చిన్నపిల్లల వైద్య నిపుణులు,డాక్టర్ ప్రసాద్ నాయక్ – ఎముకల వైద్య నిపుణులు,డాక్టర్ మణికంఠ – జనరల్ ఫిజీషియన్,డాక్టర్ నిఖిల్ – చర్మవ్యాధుల వైద్య నిపుణులు,శిబిరంలో రోగులకు ల్యాబ్ టెక్నీషియన్లు లక్ష్మణ్, యాదగిరి,రషీద్, కృష్ణ, మధు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన డాక్టర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, మెడిసిన్ అందించిన దాతలను, వారి సిబ్బందిని జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జానకిరామ్ రెడ్డి,వెంకట్ రత్నం, కోశాధికారి చిన వెంకన్న, కార్యదర్శులు పులి శ్రీనివాస్ గౌడ్, నామ రత్నకుమార్, డైరెక్టర్లు సక్రాం నాయక్, శ్రీను,సైదులు, మహేష్ రెడ్డి, రాధి రాజేశ్వరి, అశోక్, నాగరాజు కృష్ణ రెడ్డి అలాగే సభ్యులు ఇద్దయ్య, పిచ్చయ్య, హేమ్ల నాయక్, నాగు నాయక్,వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అనిల్ , బధ్య నాయక్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



