పట్టభద్రుల ఓటర్లందరూ తమ ఓటును వెంటనే నమోదు చేసుకోవాలి :- మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జ్ నల్లమోతు భాస్కర్ రావు విజ్ఞప్తి చేశారు.తాను కూడా ఈరోజే తన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే తమ పేర్లను పట్టభద్రుల ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని భాస్కర్ రావు సూచించారు.“నేను నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును ఈరోజే నమోదు చేసుకున్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా మీ ఓటును వెంటనే నమోదు చేసుకోండి” అని పట్టభద్రులకు ఆయన పిలుపునిచ్చారు.



